ఒకప్పుడు భారతదేశంలో ఫోన్ల విభాగంలో మకుటం లేని మహారాజుగా ఉన్న నోకియా ఇప్పుడు పునర్ వైభవం కోసం పాకులాడుతోంది. అయితే మిగతా ఫోన్ల బ్రాండ్లన్నీ స్మార్ట్ ఫోన్ల మీదనే దృష్టి పెడితే నోకియా తను బాగా ఆరితేరిన ఫీచర్ ఫోన్ విభాగంలో కూడా అప్పుడప్పుడు ఫోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఆ కోవలోనే తాజాగా మరో ఫోన్ ను కూడా నేడు(గురువారం) మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ ఫోనే నోకియా 110. నోకియా గతంలో విడుదల చేసిన నోకియా 105కి తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ని వినోదం అందించే ఫోన్ గానే నోకియా ముందు నుంచీ ప్రచారం చేస్తుంది. ఫోన్ లో MP3 పాటలను స్టోర్ చేసుకుని ప్లే చేయడంతో పాటు ఎఫ్ఎం రేడియోలో పాటలను కూడా వినే అవకాశం ఉండటం ఇందులోని ప్రత్యేకత. నోకియా పాత ఫీచర్ ఫోన్ అంటే ప్రపంచం మొత్తానికి గుర్తొచ్చే స్నేక్ గేమ్ ను నోకియా ఇందులో కూడా ఉంచింది.
నోకియా 110 ఫోన్ ధర..
నోకియా 110 ధరను భారతదేశంలో రూ.1,599గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లాక్, ఓషన్ బ్లూ, పింక్ రంగుల్లో లభిస్తుంది. అక్టోబర్ 18 నుంచి ఈ ఫోన్ రిటైల్ స్టోర్లతో పాటు, నోకియా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ను ఐఎఫ్ఏ 2019 సదస్సులోనే ప్రపంచానికి పరిచయం చేయగా, భారత మార్కెట్లోకి గురువారం తీసుకువచ్చారు.
నోకియా 110 ఫోన్ ఫీచర్లు..
1. 1.77 అంగుళాల క్యూక్యూవీజీఏ(QQVGA) డిస్ ప్లే
2. 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్
3. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు ఈ ఫోన్ స్టోరేజ్
4. 800 ఎంఏహెచ్ బ్యాటరీ
5. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 14 గంటల పాటు ఈ బ్యాటరీ పనిచేయనుంది.
6. ఫొటోలు తీసుకోవడానికి ఈ ఫోన్ కి వెనకవైపు కెమెరా