కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ ఎమ్మెల్యే కూడా ట్రాఫిక్ జరిమానా కట్టి సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బైక్ వెనకాల కూర్చుని హెల్మెట్ పెట్టుకోకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్ కు పాట్నా పోటీసులు చలాన్ విధించారు. దీంతో ఆయన రూ. వెయ్యి చెల్లించారు. బైక్ కు సంబంధించిన పేపర్లు మొత్తం ఉన్నప్పటికీ వెనుక కూర్చుని హెల్మెట్ ధరించకపోవడంతోనే చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.