శ్రీకాళహస్తి పట్టణంలో శుకబ్రహ్మాశ్రమంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. గురుపౌర్ణమి సందర్బంగా మంగళవారం శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి విగ్రహానికి విశేషమైన పూజాదికార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాదిపతి విద్యాప్రకాశనంద స్వామి సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంధి భక్తులు పాల్గోన్నారు. గురుపౌర్ణమి సంధర్బంగా భక్తులు అశేషంగా పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం పొందారు.