ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యధిక బ్రాండ్లకు ఆమే ప్రచారకర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 04:24 PM

ముంబయి: అత్యధిక బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించడం ద్వారా బాలీవుడ్‌ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణె మరో రికార్డును తనఖాతాలో వేసుకొన్నారు. ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పో ప్రచారకర్తగా ఇప్పటివరకూ ఉన్న సోనమ్‌కపూర్‌ స్థానంలో ప్రస్తుతం దీపికా పదుకొణెను తీసుకున్నారు. దీంతో దీపికా దాదాపు 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. సౌందర్య సాధనాలు, ఎయిర్‌లైన్స్‌, మొబైల్‌ కంపెనీలు ఇలా రకరకాల సంస్థలకు ఆమె ప్రచారకర్తగా ఉన్నారు. బాలీవుడ్‌లో తన హవా కొనసాగిస్తున్న దీపిక ప్రకటనల్లోనూ రాణిస్తోంది. ఇప్పటి వరకూ ఏ సెలబ్రెటీ ఇన్ని బ్రాండ్లకు ప్రచారకర్తగా లేరట. మ్యాగజైన్‌ కవర్‌పేజీ, బిల్‌బోర్డ్స్‌, టెలివిజన్‌ ప్రకటనల్లోనూ ఆమె కనిపిస్తున్నారు. నైక్‌, తనిష్క్‌, విస్తారా, ఒప్పో వంటి ప్రముఖ కంపెనీలకు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌.ప్రస్తుతం దీపికా పదుకొణె ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’ చిత్రంలో రాణి పద్మావతిగా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com