తమిళనాడు :చిత్ర నిర్మాణ సంస్థ లైకా నిర్మించిన 150 గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే నెల 9,10తేదీల్లో హాజరుకావాలని శ్రీలంక నుంచి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. అయితే తమిళులను అణచివేసిన రాజపక్సే కుటుంబంతో లైకా సంస్థలకు సంబంధాలున్నాయని తమిళ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన పర్యటను రద్దు చేసుకున్నారు.