హైదరాబాద్: నేను ఎలాంటి ఎమోషన్స్ లేని వ్యక్తిని అని రామ్ గోపాల్ వర్మ చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటి వర్మ కూడా ఎమోషన్ అయ్యారు. ఏకంగా కన్నీరు పెట్టారు. మరి వర్మను అంతలా ప్రభావింతం చేసిన అంశం ఏంటో తెలుసా? అది మరేదో కాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూలో వర్మ స్థిరత్వంలేని దర్శకుడు అనే ప్రశ్నకు అమితాబ్ స్పందిస్తూ స్థిరత్వం లేకపోవడమనేది ఓ విచిత్రమే. ఒకేలా ఉండే నేపథ్యాలు, సినిమాలు ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తాయి. ఎప్పుడూ నల్లరంగు దుస్తులే వేసుకున్నప్పుడు వేరే రంగులోని అంతాన్ని గుర్తించడంకష్టం. ఒకే రంగు దుస్తుల్లో ఉండడం చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే రాంగోపాల్ వర్మది విరామం లేకుండా సృజనాత్మకంగా ఆలోచించే తత్వం. ఎప్పుడూ తన ఆలోచనల నుంచి ఏదో ఒక కొత్తదనం రావాలనుకునే వ్యక్తి వర్మ అంటూ అమితాబ్ గొప్పగా చెప్పారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ తో సర్కార్-3 సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా అమితాబ్ ఇటీవల సుభాష్ ఘాయ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ ఘాయ్ అడిగిన ప్రశ్నలు, దానికి అమితాబ్ సమాధానం చూసి ఎమోషన్ అయ్యారట వర్మ.