ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటి హబ్‌గా నవ్యాంధ్రప్రదేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 01:20 AM

  -కృష్ణపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి
  -భారతీయ సంస్కతీ, సంప్రదాయాల కలయిక
  -రాష్ర్ట ప్రజల అభిప్రాయాలనూ గౌరవించేలా ఏర్పాట్లు
  -రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
 విజయవాడ, సూర్య బ్యూరో : నవ్యాంధ్ర రాష్ర్ట అభివృద్ధిలో వడివడిగా కీలక అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజా సహకారం. భాగస్వామ్యంతో సమగ్రాభివృద్ధి సాధన కోసం నిరంతరం శ్రమిస్తామని అన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలపై ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖాధిపతులతో ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్‌‌స ద్వారా సమీక్షిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఇప్పటికే ప్రపంచ దష్టిని ఆకర్షిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. భారతీయ సంస్కతీ, సంప్రదాయాల కలయికతో ప్రపంచంలో అద్భుతంగా వుండేలా అమరావతి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఉంటుందని వివరించారు. సంప్రదాయం లోనూ, ఆధునీకతను మేళవించాలని ప్రధాన డిజైన్‌ రూపకర్తలకు సూచించా మన్నారు. ప్రజా రాజధానిగా రూపు దిద్దేందుకు వీలుగా రాష్ర్ట ప్రజలందరి అభిప్రాయాలనూ గౌరవించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అమరావతి రాజధాని నగరం ప్రపంచానికే ఒక ఐకానిక్‌గా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే డిజైన్ల ఆమోదం విషయంలో బాగా శ్రద్ద వహిస్తున్నామన్నారు. హైకోర్టు, రాజభవన్‌, ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు రాష్ర్ట సంస్క తీ, సాంప్రదాయాలకు కేంద్రీ కృతమయ్యేలా నిర్మించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని ముఖ్య మంత్రి వివరించారు. నవ్యాంధ్ర రాజధాని వాణిజ్య వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కేంద్ర బిందువు కానున్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అంతర్జా తీయ, జాతీయ స్థాయి విద్యా సంస్థలు అమరావతి కేంద్రంగా తమ సంస్థలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. ఈ సంస్థల రాకతో. రాష్ర్టంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని చెప్పారు. సాంకేతిక విద్యా సంస్థలతోపాటు. వైద్యవిద్యను అందించే సంస్థల రాకతో ఒకవైపు విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కలుగ ƒడంతోపాటు రాష్ర్ట ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతికి వైద్య సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటుతో సహా ప్రఖ్యాత ఐటి సంస్థలు తమ కార్యకలాపాలు చేపట్టేందుకు ముందుకు రావడం స్వాగతించదగ్గదని సీఎం చెప్పారు. రాష్ర్టం ఐటి హబ్‌గా మారనున్నదని సీఎం ఆకాంక్షించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ``టెరి ``(ది ఎనర్జీ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్‌-ఢిల్లీ) అమరావతి అభివద్ధిలో భాగస్వామ్యం కావడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన విషయాన్ని పురపాలక శాఖ మంత్రి డాక్టర్‌ పి.నారాయణ, స్పెషల్‌ సీయస్‌ టు సీయం సతీష్‌చంద్ర, ఇంధన శాఖ, ఐ అండ్గ ఐ సీఆర్డీఏ, ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, సీఆర్డీఏ కమీషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రస్తావించినప్పడు ఇది పెరుగుతున్న మన రాష్ర్ట ప్రతిష్టకు నిదర్శనం అని సీఎం అన్నారు. రాష్ర్ట ఆర్థిక రాజధాని విశాఖతో సహా రాయలసీమ జిల్లాలైన అనంత పురం, చిత్తూరుతో సహా అమరావతి కేంద్రంగా ఐటిరంగం అభివద్ధి జరుగ నున్నదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల హెచ్‌సిఎల్‌ తమ కార్యా కలాపాలను విజయవాడలో స్థాపించేందుకు ముందుకు రావడం రాష్ర్ట విద్యార్ధులకు యువతకు శుభ సూచకమని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. రాష్ర్ట ఆర్ధిక రాజధాని విశాఖపట్నం కూడా పలు అభివద్ధి కార్యక్రమాలతో దూసుకపోతోందన్నారు. ఫిన్‌టెక్‌‌స టవర్‌‌స నిర్మాణం తర్వాత. విశాఖలో పెట్టుబడులకు పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నా యని అన్నారు. వీసా, థామస్‌ రాయ్‌ టవర్‌‌స వంటి సంస్థలు విశాఖ పిన్‌టెక్‌‌స టవర్‌‌స లో తమ కార్యకలాపాలను చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. అమరావతిలో యస్‌ బ్యాంక్‌ ఫిన్టెక్‌ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు, పర్యాటక రంగానికి సహకరించేందుకు ముందుకు రావడం, నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశ మని చంద్రబాబు చెప్పారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు తరహాలో ఈ ఏడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ ``ఫిన్‌టెక్‌'' సదస్సును విశాఖలో నిర్వహించ నున్నామని సీఎం చెప్పారు. వీటిలోనూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్థించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఐటి సెక్రటరీ కె.విజయానంద్‌ను ఆదేశించారు. ఉమ్మడి రాష్ర్టంలో మైక్రోసాఫ్‌‌ట సంస్థను హైదరాబాదులో స్థాపించేందుకు ఆనాడు ఆ సంస్థ అధిపతి బిల్‌గేట్‌‌సను 45 నిమిషాల్లో ఒప్పించామని, ఇప్పడు మన రాష్ర్టంలోనూ ఆ సంస్థ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రయ త్నాలు ముమ్మరం చేశామని అన్నారు. 


   రాష్ర్టంలో ఈ-డెవలప్‌మెంట్‌ సెంటర్‌ స్థాపనపై నిర్ణయం తీసుకునే లోగా మైక్రోసాఫ్‌‌ట సేవలను అందించడం ద్వారా ఈ-ప్రగతి, ఇతర పాలనలో సంపూర్ణ సహకారం ఇస్తామని, ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ళ హామిని ఇవ్వడాన్ని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. దీనివల్ల నిజమైన లబ్దిదారులందరికీ అభివద్ధి సంక్షేమ పథకాలు దక్కుతాయన్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేంత దాకా రైతులు నీటి కోసం అవస్తలు పడకుండా ఉండేం దుకు వీలుగా ఎత్తి పోతల పథకాల ద్వారా పంటలకు నీరందించే చర్యలు వేగవంతం చేశామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి, కష్ణానది అనుసంథానం చేయడంతో పాటు. కష్ణా డెల్టాకు సాగునీటిని అందించ గలిగామని చెప్పారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కె.సి కెనాల్‌ రైతులకు సాగునీటిని అందించా మని గుర్తు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో రాయలసీమ జిల్లాల్లో 800 మెగావాట్లు అదనంగా కేటాయించి రైతుల పంపుసెట్లకు 24 గంటల పాటూ కరెంట్‌ సరఫరా చేసిన ఖ్యాతి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పారిశ్రా మిక పెట్టుబడులు ఆహ్వానిం చడంలోనూ ముందంజలో వున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ర్టంలో అమలు చేస్తున్న సులభ సరళి వాణిజ్య విధానం పారిశ్రామిక వేత్తలలో కొత్త ఆశలు రేపాయని. వారిలో విశ్వాసాన్ని పెంచాయని సీఎం అన్నారు. ``కేంద్రం అమలు చేస్తున్న సముద్ర తీర ప్రాంత పారిశ్రామిక ఆర్థికాభివద్ధి మండలిలో భాగంగా వైజాగ్‌-చెన్నయ్‌ ఇండస్ట్రీయల్‌ కారిడర్‌, బెంగుళూరు-చెన్నయ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పనులకు ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏబిబి) ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇటీవల కేంద్రం-ఏడీజీ- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు వైజాగ్‌-చెన్నయ్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌కు రూ.2500 కోటు మంజూరు పత్రాలపై ఒప్పందం చేసుకున్నాయి. ఈ పథకంలో 50 శాతం వాటా కింద రాష్ర్ట ప్రభుత్వం భూమిని పెట్టుబడిగా పెట్టనుంది.
 బెంగళూరు - చెన్నయ్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నది. ఈ రెండు కారిడార్‌లు పూర్తయితే రాష్ర్టంలోని 974 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీర ప్రాంతమంతా పారిశ్రామికంగా వద్ధి సాధిస్తుందని సీఎం అన్నారు. ప్రపంచంలో అభివద్ధి చెందిన నగరాలు, రాష్ట్రాల భౌగోళిక స్థితిగతులను పరిశీలిస్తే. నదులు, సముద్ర తీరప్రాంతాల్లో ఉన్నవే. రాష్ట్రానికి సముద్ర తీర ప్రాంతమే ఆర్థికాభివద్ధి కేంద్రంగా మారుతుంది'' అని చంద్రబాబు చెప్పారు. రాష్ర్టంలో ఇంధన రంగంలో స్వయంసంవద్ధిని సాధించామని ముఖ్యమంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విద్యుత్‌ పొదుపు-సంరక్షణ ఫథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక లబ్దిచేకూరుతుందని, పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగు తుందని అన్నారు. అభివృద్దే నామం. అభివృద్ధికి ఆయువు పట్టయిన 247 కరెంట్‌ను శాశ్వతం చేస్తాం. భవిష్యత్తులో ఇక ఎప్పటికీ కరెంట్‌ కోతలకు ఆస్కారమే వుండదు. కరెంట్‌ కోతలకు ఇప్పటికే చరమగీతం పాడాం అన్నారు.
   ఈ సందర్బంగా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌ జైన్‌, కె.విజయానంద్‌ ముఖ్యమంత్రికి వివరిస్తూ ఈ నెలాఖరులో వాషింగ్టన్‌లో జరిగే ప్రపంచ బ్యాంక్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌‌స మీటింగ్‌లో తొలి దశలో రూ.2500 కోట్ల ప్రపంచ బ్యాంక్‌ రుణాన్ని ఆమోదిస్తున్నట్లు సమాచారం అందినట్లు చెప్పారు. విద్యుత్‌ వ్యవస్థను మరింత పటిష్ట పరిచి 247  కరెంట్‌ సరఫరా శాశ్వతం చేయడానికి ఈ రుణం బాగా దోహదం చేయనున్నట్లు వారు చెప్పారు. రాష్ర్ట సమగ్రాభివద్ధికి దోహదపడే అన్ని కార్యక్రమాలను వేగవంతం చేశాం, ప్రతీ పథకం ఫలాలు ప్రజలకే, ముఖ్యంగా పేదలకు చేరేలా పకడ్బందీగా ప్రణాళికలు రచించామని. వీటి అమలులో అధికారులు పూర్తిగా నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు ఆదేశించారు. ఏదేమైనా భావితరాల వారికి బంగారు భవిష్యత్‌ కోసం ఏర్పడే నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రగతిపథంలో నడవాలని ఆశిస్తూ అందరం సహకరిద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com