ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ 2004లో డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే ఫేస్ బుక్ ను స్థాపించిన మార్క్ జుకర్ బర్గ్ అనంతరం తన చదువుని కొనసాగించలేదు. మే నెలలో జరుగబోతున్న హార్వర్డ్స్ అప్ కమింగ్ గ్రాడ్యుయేషన్ సెర్మినీలో జుకర్ బర్గ్ ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు. ప్రారంభోత్సవ ప్రసంగానికి వస్తున్న మార్క్ జుకర్ బర్గ్ కు గౌరవ డిగ్రీ పట్టా అందించాలని యూనివర్సిటీ నిర్ణయించింది ప్రపంచంలో అత్యంత ఆదరణ సంపాదించుకున్న ఫేస్బుక్కు సుమారు 2 బిలియన్ ఖాతాదారులున్నారు. ఇటీవల కాలంలో ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్న అతిపిన్న వయస్కుడిగా మార్క్ జుకర్ వర్క్ గుర్తింపులోకి రానున్నారని హార్వర్డ్ డైలీ స్టూడెంట్ న్యూస్ పేపర్ ది హార్వర్డ్ క్రిమ్సన్ నోట్స్ లో తెలిపింది.