పారిస్: టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నడాల్ గొప్ప ప్లేయరే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈ క్లే కోర్ట్ కింగ్ ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్లో దూసుకెళ్తున్నాడు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో లోకల్ బాయ్ రిచర్డ్ గాస్కెట్పై 6-3, 6-2, 6-2తో సునాయాసంగా గెలిచి నాలుగో రౌండ్లో అడుగుపెట్టాడు. రికార్డు స్థాయిలో 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్పై కన్నేసిన రఫా.. మ్యాచ్ తర్వాత అక్కడి బాల్బాయ్ కలను సాకారం చేశాడు. ప్రెజెంటర్ అతని ఇంటర్వ్యూ తీసుకుంటున్న సందర్భంగా మీకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారుగానీ.. ఇక్కడున్న మీ అతిపెద్ద అభిమాని.. మీతో ఒక్క బాలైనా ఆడాలనుకుంటున్నాడు అని నడాల్తో చెప్పింది.
Why we ❤️ tennis.
Rafa Nadal makes a ball boy's dream come true. #RG18 pic.twitter.com/Kk8cweZK7m
— TSN Tennis (@TSNTennis) June 2, 2018