పాత గుంటూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బాలికపై యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. నిందిడిని కఠినంగా శిక్షించాలని పాతగుంటూరు పీఎస్ ఎదుట బాలిక బంధువులు, స్థానికులు ఆందోళన నిర్వహించారు. యువకుడిని తమకు అప్పగించాలంటూ ఆందోళనకారులు ధర్నాకు దిగడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీస్‌స్టేషన్‌పై ఆందోళనకారులు రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. పలు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రాళ్లదాడిలో పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందు పోలీసులు లాఠీఛార్జి చేశారు.