ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొనాల్డోను ఆడించరా? గర్ల్ ఫ్రెండ్ పోస్టు!

sports |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 11:21 AM

ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నిర్ణయంపై ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రొనాల్డో ప్రేయసి జార్జీనా రోడ్రిగెజ్ సోషల్‌మీడియా వేదికగా స్పందించింది. ''కంగ్రాచ్యులేషన్స్ పోర్చుగల్. ఆ 11 మంది ఆటగాళ్లు జాతీయ గీతం ఆలపిస్తుంటే.. అందరి కళ్లు మాత్రం నీపైనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు ఆడటాన్ని 90 నిమిషాలపాటు ఎంజాయ్ చేయలేకపోవడం ఎంత దురదృష్టం. ఫ్యాన్స్ నువ్వు రావాలని కోరుతూ నిన్ను పిలుస్తూనే ఉన్నారు. ఆ భగవంతుడు, నీ స్నేహితుడు ఫెర్నాండో మరోసారి మా అందరికీ ఆనందాన్ని పంచాలని ఆశిస్తున్నా' అని ఆమె పోస్టు చేసింది. ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com