ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెల్లుల్లి ఊరగాయ గురించి ఎప్పుడైనా విన్నారా...!

Recipes |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 06:43 PM

కావలసిన పదార్ధాలు: వెల్లుల్లిపాయలు - పావుకేజీ, నువ్వులు - 50గ్రా., నిమ్మకాయ - 1, బెల్లం - అరకుందు, నూనె - పావుకేజీ, మెంతులు - 50గ్రా., ఆవాలు - 50 గ్రా.,ఉప్పు - రుచికి సరిపడా, పచ్చి కారం - 50 గ్రా.
తయారీవిధానం:
--- వెల్లుల్లిపాయలను ఎండ తగిలే స్థలంలో ఉంచి, ఆ తర్వాత కొన్నిటికి పైపొట్టు తీసేసి, మరికొన్నింటికి పొట్టును తియ్యకుండా అలానే ఉంచెయ్యండి.
--- బెల్లంను తురిమి పెట్టుకోండి. నిమ్మకాయ రసం పిండి పక్కన పెట్టుకోండి.
--- స్టవ్ వెలిగించి, మెంతులు, ఆవాలు, నువ్వులు విడివిడిగా వేయించుకోండి. నూనె వెయ్యకూడదు. ఆ తర్వాత మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి.
--- పచ్చడిని కలుపుకునేందుకు వీలుగా ఉండే వెడల్పాటి బేషన్ ను కానీ, గిన్నెను కానీ తీసుకోండి.
--- అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, నూనె, మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి బాగా కలపాలి.
--- ఇప్పుడు ఇందులోనే బెల్లం తరుగును, నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలిపి, మూత పెట్టెయ్యాలి.
--- రెండవ రోజు మరికొంత నూనె వేసి మరోసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం, పులుపు మీ రుచికి తగ్గట్టు సరిపోయాయాయో లేదో చూసుకుని కలుపుకోండి.
---  పచ్చడికి నీళ్లు తగలకుండా చూసుకోవాలి. ఈ ఊరగాయ మూడు వారాలపాటు నిల్వ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com