ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనతికాలంలోనే బరువు పెరగాలనుకుంటున్నారా... ఐతే ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి

Health beauty |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 10:21 PM

అధిక బరువుతో బాధపడే వాళ్ళు కొంతమందైతే, సన్నగా ఉండి బాధపడేవాళ్లు మరికొంతమంది. సన్నగా ఉన్నవాళ్లు ఏదో ఒకటి చేసి ఎలాగైనా బరువు పెరగాలనుకుంటారు. బరువు పెరగడంలో పెద్ద సమస్యేమీ లేదు... ఏది పడితే అది తింటే సరిపోతుంది కదా అనుకుంటారు చాలామంది. ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం ఎంత ఉందో అంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యకరమైన బరువును వీలైనంత త్వరగా పొందాలనుకునే వారు ఒక్కసారి ఈ డైట్ ప్లాన్ ను ఫాలో అవ్వండి. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. 


--- క్రమం తప్పకుండా రోజూ భోజనం చెయ్యాలి. 


--- పాలలో నానబెట్టిన ఎండు ఖర్జూరం తరచూ తినాలి. 


--- వెన్న లేదా నెయ్యిని భోజనంలో భాగం చేసుకోవాలి. 


--- టీ, కాఫీలకు బదులు అరటిపండుతో తయారుచేసిన జ్యూస్ ను తాగాలి. 


--- మధ్యాహ్నం పూట చిన్న కునుకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 


--- డార్క్ చాకొలేట్ ను, పీ నట్ బటర్ ను తినటం అలవాటు చేసుకోవాలి. 


--- ఉడకబెట్టిన బంగాళదుంపలను కాకుండా, బేక్ చేసినవి తీసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com