సూపర్ సిక్స్‌లో చంద్రబాబు పింఛన్ హామీని ఎత్తేశాడని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ.. ఓ వల మాదిరిగా ప్రజల మీద వేస్తాడు. అదే జరిగితే, మళ్లీ చంద్రముఖిని మనమే నిద్రలేపుతాం అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. మళ్లీ వదల బొమ్మాలీ వదల అంటూ పశుపతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి రక్తం తాగుతాడని గుర్తుపెట్టుకోవాలన్నారు.