ప్రపంచానికి రష్యా గుడ్న్యూస్ చెప్పింది. రష్యాకు చెందిన సెచెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంత మయ్యాయని ప్రకటించింది. దీంతో కరోనాతో సతమతమవుతున్న ప్రపంచానికి కాస్త ఊరట కల్పించింది. టైమ్స్ నౌ న్యూస్ కథనం మేరకు.. ఇప్పటికే వ్యాక్సిన్ను కనుగొనేందుకు అనేక దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు భారత్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంది. ఇటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మరో వ్యాక్సిన్ కూడా క్లినికల్ టెస్ట్ దశలో ఉంది. దీంతో ఈ క్రమంలో ఆదివారం నాడు రష్యా గుడ్న్యూస్ తెలిపింది. సెచెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించింది. సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని వర్సిటీ విభాగ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ న్యూస్ ఏజెన్సీతో తెలిపారు.