ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ జీవితాన్ని మార్చే 17 వస్తువులు..రూ.500 మాత్రమే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 01:11 PM

చాలా మందికి రోజూవారీ జీవితంలో అనేక వస్తువుల సాయం అవసరం ఉంటుంది. అయితే అందులో కొన్ని పరికరాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీ శ్రమను తగ్గిస్తాయి. వాటి ఖర్చు కూడా చాలానే తక్కువగా ఉంటుంది. మరి అతి చౌకగా కేవలం రూ.500 ల్లోనే దొరికే ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


1.స్ట్రైనర్ బౌల్: చిన్న చిన్న రంధ్రాలతో కూడిన స్ట్రైనర్ బౌల్ లో మీరు బఠానీలు లేదా బియ్యం, ఇతర వస్తువులను నీటిలో కడగవచ్చు. దీని ధర కేవలం రూ. 99 మాత్రమే.


2.ట్రావెల్ సబ్బు హోల్డర్ల ప్యాక్: ఇది మీరు బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేసే సమయంలో బాగా ఉపయోగపడుతుంది. సబ్బును కవర్లలో చుట్టుకుని తీసుకెళ్లకుండా వీటిలో ఉంచి తీసుకెళ్లడం మీకెంతో సేఫ్. దీని ధర కేవలం రూ.250 మాత్రమే.


3. 12 ఫాబ్రిక్ కేబుల్: మీ ఛార్జర్, ఇయర్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్ లకు ఈ కేబుల్స్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 12 ఫాబ్రిక్ కేబుల్ మీ జేబులో పెట్టుకుని కూడా తీసుకెళ్లవచ్చు. దీని ధర కేవలం రూ. 191మాత్రమే.


4. బ్యాగ్ సీలర్: ఇది 18 ఐటెంస్ సెట్ - దీని ద్వారా నిల్వ జాడీలు లేదా పెట్టెలు, కంటైనర్‌లో ఉంచడానికి, కవర్లను ప్యాక్ చేయడానికి ఇలా చాలా వాటికి ఇది ఉపయోగపడుతుంది. దీని ధర కేవలం రూ.93మాత్రమే.


5.హెడ్‌ఫోన్ స్ప్లిటర్: ఇందులో 5 మార్గాల ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని ధర కేవలం రూ. 279మాత్రమే.


6.హెయిర్ రూట్ అప్లికేటర్: మీ హెయిర్ ట్రీట్మెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది. అవసరమైన చోటికి 2 హెయిర్ రూట్ అప్లికేటర్లను తీసుకెళ్లవచ్చు. దీని ధర కేవలం రూ.199మాత్రమే.


7. కమాండ్ స్ట్రిప్స్: ఇది డ్రిల్లింగ్ లేకుండా గోడలపై పిక్చర్ ఫ్రేమ్‌లతో సహా అంటుకునేలా చేస్తుంది. దీని ధర కేవలం రూ.199మాత్రమే.


8.పాలరాయి కాంటాక్ట్ షీట్: పాతగా ఉన్నవాటిని, మరకలున్న ఫర్నిచర్స్ ను, గోడలు లేదా మీ ల్యాప్‌టాప్‌ను కప్పి ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర కేవలం రూ.299మాత్రమే.


9. స్లీవ్ ప్యాక్: 3 RFID స్లీవ్‌ల ప్యాక్ అనేది మీ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు పాస్‌పోర్ట్‌లను ఎలక్ట్రానిక్ పిక్ పాకెట్ మరియు డేటా దొంగతనం నుండి సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీని ధర కేవలం రూ. 259మాత్రమే.


10. మొటిమల పాచెస్: ఇది మీ ముఖంపై ఉన్న మొటిమలను, ఎరుపు మరియు గడ్డలను తక్షణమే దాచిపెడతాయి. మీరు దీన్ని ఉపయోగించి మీ ముఖాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. దీని ధర కేవలం రూ.299మాత్రమే.


11. 5 మెష్ లాండ్రీ బ్యాగ్‌ల ప్యాక్: మీరు లాండ్రీ వేయడానికి చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ లాండ్రీ బ్యాగ్ ప్యాక్ ల సాయంతో మీ బట్టలను వేరు చేసి ఒకే వాష్ లో లాండ్రీ అయిపోగొట్టుకోవచ్చు. దీని ధర కేవలం రూ.399మాత్రమే.


12. ఫ్రూట్ బాలర్ మరియు కర్వర్: ఇది పండ్లను కత్తిరించడాన్ని సులభం చేస్తుంది. పండ్లలోని గూజును బయటకు తీయడానికి మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ధర కేవలం రూ.299మాత్రమే.


13. 5-లేయర్డ్ కత్తెర: ఈ కత్తెర సాయంతో ఆకు కూరలను సులభంగా కత్తిరించవచ్చు. దీని ధర కేవలం రూ.155మాత్రమే.


14. కట్ ప్రూఫ్ హ్యాండ్ సేఫ్టీ గ్లౌజులు: పండ్లను కత్తించే సమయంలో మీ చేతికి గాయం అయ్యే అవకాశం ఉంది. ఈ కట్ ప్రూఫ్ హ్యాండ్ సేఫ్టీ గ్లౌజులను ఉపయోగించి పండ్లను సులభతరంగా కట్ చేయవచ్చు. దీని ధర కేవలం రూ.449మాత్రమే.


15.స్క్రబ్బింగ్ బ్రష్: మీరు ఏదైనా వస్తువులనో లేదా బట్టలనో శుభ్రం చేయడానికి స్క్రబ్బింగ్ బ్రష్ బాగా ఉపయోగపడుతుంది. క్లీనర్ / డిష్ వాష్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర కేవలం రూ.279మాత్రమే.


16.సిలికాన్ బ్రిస్టల్ గ్లౌజులు: మీ పెంపుడు జంతువులకు స్నానం చేయాలనుకున్నప్పుడు, కారు శుభ్రపరచడానికి, వంట పాత్రలు కడగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర కేవలం రూ.339మాత్రమే.


17.సూపర్ నిఫ్టీ లాంతరు (కాంస్యం): ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. బ్యాటరీ సాయంతో లేదా సౌర శక్తితో ఈ లాంతరు పనిచేస్తుంది.దీని ధర కేవలం రూ.399మాత్రమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com