ఒప్పో రెనో 3 ప్రో మొబైల్ నుచేశారు కొనేవారికి శుభవార్త. ఆ మొబైల్ ధరను మనదేశంలో రూ.2,000 తగ్గించారు. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ లో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. రెనో 3 ప్రో మనదేశంలో మార్చిలో లాంచ్ అయింది. ఇందులో 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి కానీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇంతవరకు అమ్మకానికి ఉంచలేదు. ఇందులో డ్యూయల్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ఒప్పో రెనో 3 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను మనదేశంలో రూ.31,990గా గతంలో నిర్ణయించారు. ఇప్పుడు దీని ధర రూ.29,990కు తగ్గింది. ఈ ధరతో అమెజాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. రెనో 3 ప్రో 256 జీబీ వేరియంట్ ధర రూ.32,990గా ఉంది.ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ టు బాడీ రేషియో 91.5 శాతం. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్ ను ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 2 మెగా పిక్సెల్ మోనో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇవి 5x హైబ్రిడ్ జూమ్, 20x డిజిటల్ జూమ్ వరకు సపోర్ట్ చేస్తాయి. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 44 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ ఓఎస్ 7పై ఒప్పో రెనో 3 ప్రో పనిచేస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,025 ఎంఏహెచ్.