ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు(01-07-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 01, 2020, 03:23 PM

రాశి-మేషం


వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంటిలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు అంతగా దక్కవు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులకు మరింత అనుకూలం. విశేషమైన శుభ ఫలితాలున్నాయి.


రాశి- వృషభం


తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి ప్రభుత్వం నుంచి సహాయం తగ్గే సూచనలు. ఐటీ నిపుణులకు శుభవార్తలు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. ఆర్ధికంగా ఎదుగుతారు.


రాశి- మిధునం


రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు. మహిళలకు కుటుంబంలో సమస్యలు.


రాశి- కర్కాటకం


కొన్ని పనులు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. కాంట్రాక్టర్లకు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు. నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.


రాశి- సింహం


ఆచార సంప్రదాయాలను గౌరవిస్తారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు స్థాన మార్పు ఉండవచ్చు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు కాగల అవకాశం. ఐటీ నిపుణులకు సమస్యల నుంచి విముక్తి. విద్యార్థులకు ఒత్తిడులు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది.


రాశి-కన్య


పనులు నత్తనడకన సాగుతాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. మిత్రులతో అకారణంగా తగాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో ఆటంకాలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు చికాకులు. ఐటీ నిపుణులకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి.


రాశి-తుల


కుటుంబసభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని ఒడిదుడుకులు. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి ఆహ్వానాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు, ఐటీ నిపుణులకు శుభవార్తలు. విద్యార్థులకు గందరగోళం తొలగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.


రాశి-వృశ్చికంఒక మంచి వార్తను వింటారు. పుణ్య క్షేత్రాల సందర్శనం. కాంట్రాక్టర్లకు ఒత్తిడులు కొంత తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు సంతృప్తికరంగా ఉండవు. ఉద్యోగులకు పని భారం తప్ప ఫలితం ఉండదు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఐటీ నిపుణులకు కొంత నిరుత్సాహం. వ్యాపార విస్తరణలకు అనుకూల ఆలోచనలు చేస్తారు.


రాశి-ధనస్సు


ఖాళి సమయాన్ని ఇష్ట దైవతారాధనకు ఉపయోగించండి. కాంట్రాక్టర్లకు అవకాశాలు చేజారవచ్చు.వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు వివాదాలు తీరుతాయి. విద్యార్థులు కొంత గందరగోళంలో పడతారు. మహిళలకు లేనిపోని చికాకులు.


రాశి-మకరం


వ్యూహాలు తప్పే అవకాశముంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం అయినా కొన్ని ఆటంకాలు ఉంటాయి. రుణాలు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు ఉండవచ్చు. రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఐటీ నిపుణులకు వివాదాలు తప్పవు.


రాశి-కుంభం


సభలు, సమావేశాల్లో పాల్గొంటానికి ఆటంకాలు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందులు ఎదురుకావచ్చు.కొత్త వ్యాపారాల ప్రారంభానికి యత్నాలు సాగిస్తారు. ఉద్యోగుల సేవకు గుర్తింపు లభిస్తుంది.రాజకీయ, కళారంగాల వారికి అనూహ్యంగా అవకాశాలు, ఆహ్వానాలు.ఐటీ నిపుణులు చాకచక్యంగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ.


రాశి-మీనం


ఖాళీ సమయంలో ఉన్నత భవిషత్తుకై ఆలోచనలు సాగుతాయి. రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.ఐటీ నిపుణులకు ఒక కీలక సమాచారం. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com