సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారి కోసం టాటా క్యాపిటల్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సరికొత్త హోమ్ లోన్ స్కీమ్ ప్రకటించింది. టాటా క్యాపిటల్ లిమిటెడ్‌కు ఈ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ చెందినది. టైర్ 2, 3 నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ స్కీమ్ ఉపయోగపడనుంది.కేవలం 7.99 శాతం వడ్డీకే రూ.35 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఆయా నగరాలు, పట్టణాల్లో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారు ప్రాపర్టీ వ్యాల్యూను బట్టి ఈ రుణాలు తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆసక్తిగలవారు www.tatacapital.com/ వెబ్సైట్లో అర్హతను తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో లాగిన్ అయి వడ్డీ రేట్లు, ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ పేమెంట్స్ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని వివరాలు నిర్దారించుకున్న తర్వాతే ముందుకు వెళ్లగలరని మనవి.