ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 10 వేలలోపే శాంసంగ్ కొత్త మోడల్?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 05:32 PM

శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ01 కోర్ ను రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లో కనిపించడంతో ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ లీక్ ఫొటోలు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ ముందూ, వెనకా ఏ విధంగా ఉంటుందో ఈ ఫొటోను చూస్తే అర్థం అవుతోంది. రెడ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కనిపిస్తోంది. వెనకవైపు సింగిల్ కెమెరా, దాని కిందనే ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్ రూ.10 వేల లోపు ధరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముందువైపు పాత ఫోన్ల తరహాలో బెజెల్స్ ను అందించారు. సెల్ఫీ కెమెరా ఫోన్ పైభాగంలో ఉంది.
సెల్ఫీ కెమెరా పక్కనే ఇయర్ పీస్ కూడా ఉంది. వెనకవైపు పట్టు బాగుండటం కోసం గరుకుగా ఉండే విధంగా ప్యానెల్ ను అందించారు. పవర్ బటన్లు ఫోన్ కుడివైపున ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా చాలా వరకు లీకయ్యాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు.
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. హెచ్ డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ HT6739WW ప్రాసెసర్ ను ఇందులో అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. 1 జీబీ ర్యామ్ ఉండనుంది. ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ లో SM-A013F/DS మోడల్ నంబర్ తో కనిపించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ01 కోర్ లో బ్లూటూత్ వీ5 ఫీచర్ ఉండనున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. వైఫై అలయన్స్, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నట్లు చర్చ సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com