ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు(22-06-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 02:08 PM

రాశి-మేషం


కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్‌లో పడతాయి. కొత్తగా ఏదైనా ప్రారంభం చేయడానికి, వాయిదా పడుతున్న పనులను పూర్తి చేయడానికి అనుకూల దినం. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ సంతానం కారణంగా గుర్తింపు లభిస్తుంది.


రాశి-వృషభం


కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.


రాశి-మిధునం


వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.


రాశి-కర్కాటకం


ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కొరకు, కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు.


రాశి-సింహం


ఇంటిలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహ సంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరఫు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు, ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడుతాయి.


రాశి-కన్య


విశేషమైన శుభఫలితాలున్నాయి. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది.


రాశి-తుల


ఆర్ధికంగా ఎదుగుతారు. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.


రాశి-వృశ్చికం


ఆచార సంప్రదాయాలను గౌరవిస్తారు. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి, బదిలీ కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను, బంధువులను కలుస్తారు.


రాశి-ధనస్సు


ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.


రాశి-మకరం


సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.


రాశి-కుంభం


పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.


రాశి- మీనం


కుటుంబసభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. అవకాశాలు అందివస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com