గ్యాంగ్ వార్‌పై బెజవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఆదేశాలతో పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. సింగ్‌నగర్‌లో రౌడీ, కేడీ, సస్పెక్ట్ షీట్స్ ఉన్నవారిని పిలిపించి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా తీవ్ర చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.