నెల్లూరులో దారుణం జరిగింది. విద్యావిహార్ స్కూల్ లో 8వ తరగతి చదివే విద్యార్థినిపై అదే.. స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న శివ అనే యువకుడు అత్యాచారం చేశాడు. నెల్లూరులోని దీనదయాల్ నగర్ ప్రాంతంలో సమాధుల వద్దకు తీసుకొచ్చి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. అత్యాచారం చేసే సమయంలో చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు గమనించి, శివకు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడంతో ఆగ్రహించిన స్థానికులు స్కూల్ వాన్ ను తగలబెట్టారు.