మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కీచక పూజారీని అన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… కడప జిల్లా సుండుపల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన 14ఏళ్ల గిరిజన మైనర్ బాలికపై దేరాంగుల.రవి అలియాస్ సత్యనారాయణ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో పారిపోయిన నిందితుడు అన్నవరంలో తలదాచుకున్నట్లుగా సమాచారం అందడంతో అన్నవరం పోలీసులు పూజారీని అదుపులోకి తీసుకున్నారు.