ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా ఐఎఎస్ వద్ద యువకుడి వింత కోరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 07:11 PM

చిత్తూరు జిల్లా కురబలకోట మండలానికి చెందిన కొమ్మద్ది బావాజీ(24) పేద కుటుంబంలో పుట్టాడు. అతడికి చదువు అబ్బకపోయినా తెలివైన కుర్రాడు. అయితే ఆ తెలివిని మంచి పనులకు ఉపయోగించకుండా అతడు జూదంలో ఉపయోగించాడు. 12వ ఏటనే పేకాటలో ప్రావిణ్యం సంపాదించిన అతడు ప్రస్తుతం అందులో మాస్టర్ గా మారాడు. ఎంతలా అంటే ప్లేయింగ్ కార్డ్స్(పేక ముక్కలు) చూడగానే ఆ కార్డు ఏమిటో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇదే ప్రావీణ్యం జూదంలో ప్రదర్శిస్తూ లెక్కకు మించి డబ్బు సంపాదించానని అంటున్నాడు.  అయితే మదనపల్లెలో సబ్ కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతిస్పందన కార్యక్రమంలో అతడు ఓ వింతైన అర్జీ పెట్టుకున్నాడు. యువ ఐఎఎస్ అధికారిణి, మదనపల్లె సబ్ కలెక్టరు చెరుకూరి కీర్తి ముందే పేక ముక్కలతో తన ప్రావిణ్యాన్ని ప్రదర్శించి...చివరకు తన ఆలోచనను ఆమెకు తెలియజేశాడు.  తన వల్ల ఓడిపోయిన కుటుంబాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మారాలనుకుంటున్నానని.. ఏ పనీ చేయలేని తాను ఈ సమాజానికి ఏదైనా కొంచెం చేయాలని ఆశిస్తూ అవయవ దానం చేయాలనుకుంటున్నానని అధికారులకు తెలియజేసి అనుమతి కోరాడు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com