ఇరాక్‌ అల్లర్లలో 60 మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 06, 2019, 01:56 AM
 

ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా ఇరాక్ లో ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ సామాన్యులు రాళ్లు రువ్విన ఘటనలు, సైనికుల కాల్పుల్లో 2,500 మందికి పైగా గాయపడ్డారు. అవినీతి, నిరుద్యోగం, తాగు నీటి సమస్య, విద్యుత్ కోతల నివారణకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన సాగిస్తున్నారు.   అల్లర్లలో మృతుల సంఖ్య 60 కి పెరిగింది. షియాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నసీరియాహ్, దివానియాహ్, బస్రా, బాగ్ధాద్ నగరాల్లో అల్లర్లు పెచ్చరిల్లాయి. ఆదిల్ అబ్దెల్ ప్రభుత్వం రాజీనామా చేయాలని విపక్ష నేత మొఖ్తదా అల్ సదర్ డిమాండు చేశారు. ప్రభుత్వం స్పం దిం చే వరకూ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చట్టసభల సమావేశాల్ని బహిష్కరించాలని కోరారు.