అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్పై సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఐటి సెల్ సభ్యుడు నీతు బోరాను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇక్కడకు వలస వచ్చిన ముస్లిం సెటిలర్లనుంచి స్థానిక అస్సామీలను రక్షించలేకపోతున్నదని నీతుబోరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి సోనోవాల్దేనని ఆయన వ్యాఖ్యానించారు.