ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వర్షాలతో పాటు పిడుగుల పడే అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 09:50 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పందించింది. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం పడే సమయలో చెట్లు, కరెంటు స్తంభాలు, హోర్డింగ్ ల కింద ఉండరాదని ప్రజలకు సూచించింది. వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com