ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 11:34 PM

దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం సాయంత్రం ఘనంగా నిత్యహోమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణమోహన, త్రివిక్రమ్‌, సాయికృష్ణ, తరుణ్‌, వేదమంత్రాలను జపిస్తూ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి చ తుష్టానార్చన, ద్వారాతోరణం, అనంతకాలపూజ, అగ్నిప్రతిష్ట, ప విత్ర ప్రతిష్ట తదితర కార్యక్రమాలను మంగళకరంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవునికడప దేవస్థానం ఇనస్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి పలువురు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com