ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్స్ అంశం చూస్తే ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నామని హోం మినిస్టర్ అనిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మొదట ఒకొక్క బోట్ బరువు 40 టన్నులు అనుకున్నాము కానీ ఆ బోట్లు 80 టన్నులు వరకు ఉందని తెలిపారు. ఈ మూడు బోట్స్ ఒకదానితో ఒకటి ఇనుప రోప్స్‌తో కలిపి ఉన్నాయన్నారు. ఇంత కుట్రకి పాల్పడిన వారిని సహించేదిలేదని తెలిపారు.