యోగి వేమన విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ శాఖ పరిశోధకురాలు షేక్ సమీనకు గురువారం వైవీయూ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. బయోటెక్నాలజీ ప్రొఫెసర్ ఎ. చంద్రశేఖర్ పర్యవేక్షణలో " నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ పద్దతిని ఉపయోగించి, కొర్రలు యందు దిగుబడిని పెంచేందుకు రికాంభినెంట్ ఇనెబ్రీడ్ లైన్స్ " ని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన భారతదేశములో మొదట ఆధునిక జీనోమ్ ఆధారిత పరిశోధన కావడం విశేషం.