యోగివేమన విశ్వవిద్యాలయ ఆర్ట్స్ విభాగ డీన్ గా చరిత్ర పురావస్తు శాఖ ప్రొఫెసర్ కంకణాల గంగయ్య నియమితులయ్యారు. గురువారం నియామకపు పత్రాన్ని వైవియు వి. సి ఆచార్య కె. కృష్ణారెడ్డి, కుల సచివులు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి తో కలసి తన ఛాంబర్ లో అందజేశారు. ఇదివరకు డీన్ గా పని చేస్తున్న తెలుగు శాఖ ఆచార్య లు టి. రామ ప్రసాద రెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో ఈ నూతన నియామకం చేపట్టారు.