చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ ను కడప జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా ఎస్. పి పోలీస్ స్టేషన్ లోని రికార్డులు పరిశీలించారు. నూతనంగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బి. ఎన్. ఎస్) పై అవగాహన పెంపొందించుకోవాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్. పి సూచించారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడి, వారి యొక్క సమస్యను అడిగి తెలుసుకోవాలి.