కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వంశీ అనే రైతు సాగు చేసిన కర్బూజా పంటను ఎలుగుబంట్లు ధ్వంసం చేశాయని రైతు ఆవేదన చెందారు. దీంతో సుమారుగా లక్షల రూపాయలు నష్టం వచ్చిందని రైతు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు గురువారం ఎలుగుబంటి కోసం అక్కడే గాలింపు చర్యలు చేపట్టారు. అటవీశాఖ సిబ్బంది మల్లికార్జున, నరేష్, దేవా నాయక్ రైతు పొలంలో గాలింపు చర్యలు చేపట్టారు.