ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దిరెడ్డి ఇంటిచుట్టూ ప్రహారా కాసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 01:41 PM

తిరు­పతిలోని వకుళామాత ఆల­యానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తు­తు­ందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీ­సులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలి­సేందుకు వచ్చిన నియోజక­వర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకు­న్నారు. వంద మీటర్ల దూరంలో బారి­కేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మె­ల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పు­కోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజక­వర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నేత­లను అదుపులోకి తీసుకు­న్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com