ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు. స్వామివారి రథం తయారీలోనూ అవినీతి జరగడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల నిధులతో రథాన్ని తయారు చేస్తే.. శిలాఫలకంపై మాజీ మంత్రి, వైసీపీ నేత వేణు పేరు ఎలా వేశారని ఈవోను నిలదీశారు.