రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఒంగోలు పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొడ్డు క్రాంతి కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆ పత్రాలను పరిశీలించి అఫిడవిట్ అందజేశారు.