మానవాళి కోసం కరుణామయుడు చేసిన త్యాగ ఫలితమే గుడ్ ఫ్రైడే, మానవుల పై ప్రేమ, నిస్సహాయుల పై కరుణ, శత్రువుల పై క్షమాగుణం, ఓర్పు, సహనం, త్యాగం తో ప్రతి ఒక్కరూ జీవించాలని, జీసస్ తన జీవితం, బోధనల ద్వార లోకానికి సందేశం ఇచ్చారని. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఏసుప్రభువు త్యాగాన్ని కీర్తించారు.అద్దంకి నియోజకవర్గ ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు.