ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 01:58 PM

వచ్చే ఏడాది 2024 జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల కోటాకు సంబంధించి షెడ్యూల్ ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ సేవలు ఆన్లైన్ లక్కీడిప్ కోసం నేటి నుంచి 20న ఉ.10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాలని టీటీడీ సూచించింది. కల్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను ఈ నెల 21న ఉ.10కి విడుదల చేయనున్నట్లు తెలిపింది. మరిన్ని సేవల వివరాల కోసం ఈ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard వెబ్సైట్ ను సంప్రదించాలని టీటీడీ కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com