ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు.... సీఐడీ ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 06:31 PM

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్‌ చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ ప్రకటించింది. నంద్యాలలో ఇవాళ ఉదయం ఆరుగంటలకు అరెస్ట్‌ చేశామన్నారు సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఆయన ప్రధాన నిందితుడని, కుట్రదారుడన్నారు. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్‌ కంపెనీకి నిధులు మళ్లించారని.. ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం వచ్చింది అన్నారు. చంద్రబాబుకు అ‍న్ని లావాదేవీల గురించి తెలుసని.. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. చంద్రబాబును కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సిందే అన్నారు.


స్కిల్‌ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో రూ.550 కోట్ల స్కాం జరిగింది అన్నారు. ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం జరిగిందని.. నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారన్నారు. ఫండ్స్ ఏమయ్యాయి అన్నది తేలాల్సి ఉందని.. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసన్నారు. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని.. ఈడీ, జీఎస్టీ కూడా దీనిపై దర్యాప్తు చేశాయన్నారు. ఈ విచారణలో చంద్రబాబు ప్రధాన లబ్ధిదారుడిగా తేలిందని.. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఆర్థిక కుట్రకు 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.


ఈ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.371 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు కాజేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. ఘంటా సుబ్బారావుకు నాలుగు పదవులు ఇచ్చారని.. చంద్రబాబు కనుసన్నుల్లోనే ఈ స్కామ్ జరిగిందన్నారు. డిజైన్ టెక్ అనే సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేశారని.. కొన్ని షెల్ కంపెనీలకు బదిలీ చేశారన్నారు. నిధులు మళ్లింపుపై చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందని.. ఈ స్కామ్‌కు సంబంధించి డాక్యుమెంట్లు కూడా మాయం చేశారన్నారు. మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. అన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబును కస్టడీకి తీసుకోవాలని.. ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తామన్నారు. ఏ డబ్బులు ఖర్చు చేయకుండానే రూ.371 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారన్నారు.


సాక్షులను ప్రభావితం చేస్తారనే చంద్రబాబును అరెస్ట్ చేశామన్నారు. ఈ స్కిల్‌ డెవలెప్‌మెంట్ కేసులో మాజీ మంత్రి లోకేష్‌ను కూడా ప్రశ్నించాల్సి ఉందన్నారు. లోకేష్, కిలారు రాజేష్ పాత్రపై విచారణ చేయాల్సి ఉందని.. లోకేష్ పాత్ర ఏపీ డెవలెప్‌మెంట్‌‌లోనే కాకుండా ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు డైవర్షన్ కేసుల్లో కూడా ఉందని.. దీనిపైనా సీరియస్‌గా విచారణ జరుగుతోందన్నారు. ముఖ్యమైన పత్రాల మాయం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని.. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉందన్నారు. టీడీపీ హయాంలో కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని సంజయ్ తెలిపారు. ఘంటా సుబ్బారావు ఎంఏఈ, సీఈవోగా వ్యవహరించారని.. ఉద్దేశపూర్వకంగా సుబ్బారావుకు నాలుగు పదవులు ఇచ్చారన్నారు. ఈయన‌ కార్పొరేషన్ ఎండీగా, సిఈవోగా, ఉన్నత విద్యా మండలి సలహాదారుగా, సీఎం సలహాదారుగా నియమించారన్నారు. ఈ ఒప్పందానికి డిజైన్ టెక్ ప్రధాన సూత్రదారి అన్నారు. డిజైన్ టెక్‌కి సంబంధించిన భాస్కర్ భార్య అపర్ణ యూపీ కేడర్ అని.. స్కిల్ కార్పొరేషన్ డిప్యూటీ సీఆవోగా వచ్చారన్నారు. నిధుల విషక్ష్ంలో ఆర్థిక శాఖ, సీఎస్ అభ్యంతరాలని పట్టించుకోలేదన్నారు. రూ.58 కోట్ల సాఫ్ట్‌వేర్‌ని రూ.మూడు వేల‌కోట్ల ప్రాజెక్ట్‌గా చూపించారన్నారు. కుంభకోణంలో కీలక వ్యక్తి అయిన డిజైన్ టెక్‌కి చెందిన మనోజ్ విదేశాలకు పారిపోయారు అన్నారు. చంద్రబాబు‌ పీఏ పెండ్యాల శ్రీనివాస్ కూడా అమెరికా పారిపోయారన్నారు. ప్రభుత్వ ధనం ఎవరిరెవరి ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించారో సీఐడీ దర్యాప్తు చేస్తోందన్నారు. చంద్రబాబుని విజయవాడకి తీసుకువస్తున్నామని.. వైద్య పరీక్షల తర్వాత ఈ రోజు సాయంత్రానికి కోర్టులో ప్రవేశపెడతామన్నారు. విదేశాలకి పారిపోయిన కీలక‌ నిందితుల‌ కోసం ఇంటర్ పోల్ తీసుకుంటామని.. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com