పత్తిపాడు మండలం, ప్రత్తిపాడు-1 సచివాలయ మహిళా పోలీస్ రజిని, గనికపూడి సచివాలయ మహిళా సోలీస్ భార్గవి ఇరువురు రోడ్ ప్రమాదంలో గాయపడి గుంటూరు పట్టణంలోని శ్రీబాలజీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. అని విషయం తెలుసుకొని ఆదివారం వారిని పరామర్శించి, యోగక్షేమములు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనంతరం హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలు గురుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని సచివాలయ పోలీసులు భార్గవి, రజినీలను ధైర్యంగా, ఉండాలని సూచించారు.