కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలంలోని అలువాల గ్రామంలో 116సంవత్సరాలు వయస్సు కలిగిన వృద్ధురాలు కోమటి జయమ్మ గురువారం మృతి చెందారు. వృద్ధురాలు మృతి చెందడంతో ఆమెను చూడడానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆమె ఇప్పటికీ కిరాణం దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. వృద్ధురాలికి కుమారుడు, కూతరు ఉన్నారు.