నేపాల్ లో భూకంపం సంభవించింది. గురువారం అర్థరాత్రి 2 సార్లు భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9, 4.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అర్థరాత్రి వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. కాగా, తాజా భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.