ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, పాస్ కాలేదని, మార్కులు తక్కువ వచ్చాయనే బాధతో రాష్ట్రంలో తొమ్మిది మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనకాపల్లి జిల్లాలో తులసీ కిరణ్(17), విశాఖలో అఖిలశ్రీ(16), బోనెల జగదీశ్(18), చిత్తూరులో అనూష(17), బాబు(17), శ్రీకాకుళంలో తరుణ్(17), అనంతపురంలో మహేశ్(17), ఎన్టీఆర్ జిల్లాలో షేక్ జాన్ సైదా(16), రమణ రాఘవ ఆత్మహత్య చేసుకున్నారు.