ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ సర్పంచుల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 06:19 PM

 వైసీపీ పాలనలో సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ సర్పంచ్‌లు వినూత్నరీతిలో నిరసన  తెలిపారు. మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు సమస్యల పుట్టిన రోజు నిర్వహించారు. నంద్యాల జిల్లా, మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ సర్పంచులు సమావేశంలో కేక్ కట్ చేసి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఏడాది కాలంగా అవి పరిష్కారం కావడంలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమ గ్రామాల్లో వాలంటీర్ల పెత్తనం ఎక్కువగా ఉందని ఆరోపించారు. వాలంటీర్లు గౌరవించనప్పుడు ఎందుకు సర్పంచ్ పదవిలో ఉండాలని అధికారులను నిలదీశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సర్పంచులే డిమాండ్ చేయడంతో అధికారులు అవాక్కయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com