ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై బోల్తాపడ్డ కారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 04:31 PM

విశాఖ శీల నగర్ నగర్ జాతీయ రహదారి వద్ద బుధవారం ప్రమాదం తప్పింది. ఈమేరకు గాజువాక నుండి ఎన్ఏడి వైపుగా వస్తున్న ఇన్నోవా కారు ను కంటైనర్ వాహనం ఢీకొనడంతో కారు ఒక్క సారిగా అదుపుతప్పి బోల్తా పడింది. గాజువాక నుండి ఎన్ఏడి వైపుగా జాతీయ రహదారి కి ఎడమవైపుగా వెళ్తున్న కారు ఒకసారిగా కుడివైపు రావడంతో వెనుక నుండి వస్తున్న కంటైనర్ వాహనం కారును బలంగా ఢీకొంది. అయితే ప్రమాదంలో ఎవరికి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరిపించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కారును అక్కడి నుండి తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com