ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉన్నవారు: నాగబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 08:25 PM

"అన్నయ్యను .. తమ్ముడిని చాలా దగ్గరగా చూసినవాడిని నేను. సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉన్నవారు అని తన అన్నయ్య, తమ్ముడి గురించి జనసేన నేత నాగబాబు వెల్లడించారు. అందుకోసం తమ డబ్బును కోట్లలో ఖర్చు చేస్తున్నారు. కల్యాణ్ బాబు విషయానికొస్తే తన ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉంటాయి. కల్యాణ్ బాబు దగ్గర డబ్బులు లేవు. మళ్లీ అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఆయన. ఇల్లు కూడా లోన్ తీసుకుని కట్టుకున్నదే .. కార్లు కూడా అంతే" అని అన్నారు. 


"పవన్ తాను సంపాదించిందంతా ప్రజల కోసం .. పార్టీ కోసం .. అవసరమై అడిగినవారి కోసం ఇచ్చేస్తూ ఉంటాడు. పవన్ కి వ్యవసాయం చేయడమంటే ఇష్టం .. అందువలన శంకర్ పల్లిలో 8 లక్షలు పెట్టి అప్పట్లో 8 ఎకరాలు కొన్నాడు. అతనికి ఉన్న ఆస్తి అదొక్కటే. అది ఇప్పుడు రేటు పెరిగితే పెరగాలి తప్ప .. అంతకుమించి అతనికి ఏమీ లేదు" అంటూ చెప్పుకొచ్చారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com