ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దినేష్‌ కార్తీక్‌ సంచలన నిర్ణయం.. వద్దంటున్న ఫ్యాన్స్

sports |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 01:37 PM

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ తర్వలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చినట్లైంది. ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు, తన అభిమానులకు కార్తీక్‌ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు దినేష్‌ కార్తీక్‌ రిటైర్మెంట్‌ తీసుకుంటున్నాడని భావించి.. ‘ప్లీజ్‌ డీకే.. వద్దు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు డీకే సంకేతాలు ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com