బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి జరుగుతున్న సమయంలో నిర్లక్ష్యం వహించిన ఏసీపీ, సీఐని సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకే రక్షణ కల్పించలేని పోలీసులు.. ప్రజలను ఏం రక్షిస్తారని నిలదీశారు. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.