నారాయణపేట మండలం కోటకొండ గ్రామ పెద్ద చెరువు నిండి అలుగు అలుగు పారుతుండడంతో నీరు మొత్తం పంట పొలాల్లోకి చేరుతుంది దీంతో పదుల సంఖ్య ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. పంట పొలాలు నీటిలో ఉండిపోవడంతో పంటలు చెడిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో నిలిచిన నీరును దిగువకు పంపించేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారు.